ఎన్‌హెచ్ 65పై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించాం: మంత్రి కోమటిరెడ్డి
23-06-2024 02:19 PM
హైదరాబాద్ : ఎన్‌హెచ్ 65పై ప్రమాదాలు జరిగే 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. చిట్యాల వద్ద రూ.40 కోట్లతో ఫ్లైఓవర్ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను, ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. రూ.30 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ పట్టణంలోని తన నివాసంలో రెండు రోజుల పాటు నియోజకవర్గ ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను మంత్రి తెలుసుకొని పరిష్కరించారు.






