31 July, 2026 | 5:04 PM

రేపటి నుంచి లోక్ సభ సమావేశాలు.. స్పీకర్ ఎవరన్న దానిపై ఉత్కంఠ

23-06-2024 02:21 PM

న్యూఢిల్లీ: రేపటి నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్ సభ స్పీకర్ ఎవరన్న దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సోమవారం ప్రారంభమయ్యే 18వ లోక్‌సభ మొదటి సెషన్‌లో కొత్తగా ఎన్నికైన సభ్యులచే ప్రమాణస్వీకారం జరగనుంది. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక, జూన్ 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్ మెహతాబ్ ఎంపీలతో ప్రమాణం చేయించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. తొలి రోజు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, రెండో రోజు తెలంగాణ ఎంపీల ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి లోక్ సభ సమావేశాలు రసవత్తరంగా సాగనున్నాయి.