31 July, 2026 | 6:39 PM

ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు: 13 ఏళ్ల బాలుడు అరెస్ట్

23-06-2024 02:08 PM

న్యూఢిల్లీ: దుబాయ్ వెళ్లే విమానంలో బాంబు పెట్టినట్లు తప్పుడు సమాచారంతో ఢిల్లీ విమానాశ్రయానికి ఇమెయిల్ పంపిన 13 ఏళ్ల బాలుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం బూటకపు బాంబు బెదిరింపు కాల్ చేసిన మరో యువకుడి వార్తలకు ప్రభావితమైన బాలుడు "కేవలం వినోదం కోసం" మెయిల్ పంపాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఐజిఐ విమానాశ్రయం) ఉషా రంగనాని తెలిపారు. జూన్ 18న దుబాయ్ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపుపై ఫిర్యాదు నమోదైందని డీసీపీ తెలిపారు.

ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి అన్ని మార్గదర్శకాలు, ప్రోటోకాల్‌లు ఎఒపిలను అనుసరించినట్లు డీసీపీ పేర్కొన్నారు. అయితే విచారణలో, ఇమెయిల్ పంపిన వెంటనే ఈ-మెయిల్ ఐడి తొలగించబడిందని చెప్పారు. ఉత్తరాంచల్‌లోని పితోర్‌ఘర్‌లో ఇమెయిల్ ట్రేస్ చేయబడిందన్నారు. అక్కడికి ఒక బృందాన్ని పంపామన్న ఆమె బూటకపు ఇమెయిల్ పంపినందుకు బాలుడిని పట్టుకున్నట్లు తెలిపారు. అతని తల్లిదండ్రులు తనకు చదువు నిమిత్తం మొబైల్ ఇచ్చారని, దాని ద్వారా తాను ఇమెయిల్ పంపానని, ఆ తర్వాత తన ఐడిని డిలీట్ చేశానని, భయపడి తల్లిదండ్రులతో ఎలాంటి సమాచారం పంచుకోలేదని బాలుడు పోలీసు బృందానికి చెప్పాడు.