calender_icon.png 9 December, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తా..

09-12-2025 01:02:14 AM

చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి గడ్డి రేణుక 

మానకొండూరు, డిసెంబర్ 8 (విజయక్రాంతి): మానకొండూరు మండల పరిధిలోని చెంజర్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటేసి తనను ఆశీర్వదించాలని సర్పం చ్ అభ్యర్థి గడ్డిరేణుక అభ్యర్థిస్తున్నారు. తన భర్త గడ్డి గణేష్‌ను ఎంపీటీసీగా రెండు పర్యాయా లు గెలిపించి అక్కున చేర్చుకున్నారని ప్రస్తుతం సర్పంచ్‌గా తనను కూడా గెలిపించి గ్రామాభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. గడ్డి గణే ష్ ఎంపీటీసీగా అనే అభివృద్ధి పనులు చేశారని ఓటర్లకు గుర్తు చేస్తున్నారు.

ఇదే తరహాలో గ్రామాభివృద్ధి ధ్యేయంగా ప్రస్తుతం సర్పంచ్‌గా ఎన్నికల బరిలో నిలిచానని, తనకు పట్టం కట్టాలని వేడుకున్నారు. కోతుల బెడద నివారిస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు, నిరుపేదల కోసం ప్రత్యేక శ్రద్ధతో రూ పాయికే అంతిమ  సంస్కారాలు నిర్వహిస్తామన్నారు. చెంజర్ల- అన్నారం, చెంజర్ల - దేవంపల్లి, చెంజర్ల - మన్నెంపెల్లి, చెంజర్ల - పోరండ్ల, గ్రామాలకు బీటీ రోడ్లను నిర్మిస్తామని ప్రజల కు హామీ ఇచ్చారు.

అలాగే గ్రామంలో ఓపెన్ జిమ్, ఐకెపి కేంద్రం ఏర్పాటు, దేవుని గుట్టను, శ్రీ మల్లికార్జున గుడి దగ్గర ఉన్న దుద్దె చెరువును అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా అభి వృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. గ్రామంలోని రెండవ వార్డులో వార్డు సభ్యుని గా గణేష్ పోటీ చేస్తున్నారని, గ్యాస్ పొయ్యి  గుర్తుకు ఓటేసి గెలిపించాలని రేణుక కోరారు.