calender_icon.png 11 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంతో చేశా.. మరెంతో చేస్తా దీవించండి

11-12-2025 12:22:25 AM

  1. ఫుట్‌బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి
  2. తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి దుండ్ర రాజయ్య

కరీంనగర్, డిసెంబరు 10 (విజయక్రాంతి): తిమ్మాపూర్ గ్రామ ప్రజలు గ్రామాభివృద్ధికి తాను చేసిన కృషికి అండగా నిలిచి ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సర్పంచ్ అభ్య ర్థి దుండ్ర రాజయ్య కోరారు. గతంలో గ్రామ సర్పంచ్‌గా తన భార్య నీలమ్మ హయాంలో ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. పోచమ్మగుడికి వెళ్లే దారి రైతులను ఒప్పించి సీసీ రోడ్డుగా పూర్తి చేశానన్నారు. పోచమ్మ గుడి ముందు రేకులషెడ్డు నిర్మాణం నా స్వంత ఖర్చులతో చేస్తానని అన్నారు.

ఈ దారిగుండా గతంలోనే పోల్స్ వేయించానని ఇప్పుడు వైరింగ్ వేయించి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయిస్తానని అన్నారు. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని, రామాలయం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వైకుంఠదామం వరకు సీసీ రోడ్డు, వీధి దీపాలు, ఆది పెరుమాండ్ల గుడి నుండి సుభాష్ నగర్ వరకు బీటీ రోడ్డు వేయిస్తానని అన్నారు. తిమ్మాపూర్ స్టేజి నుండి ఎస్సీ కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయిస్తానని అన్నారు.

రచ్చబండ నుండి గ్రామ పంచాయతీ వరకు అలాగే బొడ్రాయి నుండి పోరండ్ల రోడ్ వరకు, మర్రి చెట్టు నుండి పోచమ్మ దారి వరకు సీసీ రోడ్డు వేయిస్తానన్నారు. రామన్న చెరువుతోపాటు ఊర చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ కట్టిస్తానన్నారు. రచ్చబండ నుండి పెద్దమ్మ గుడి, పెద్దమ్మ గుడి నుండి యాదవపల్లి వరకు స్ట్రీట్ లైట్లు వేయిస్తానని, ఊర చెరువు వద్ద ఓపెన్ జిమ్ నిర్మాణం చేయిస్తానని, మర్రి చెట్టు, హనుమాన్నగర్ వద్ద ఓపెన్ జిమ్ నిర్మాణం చేపడతా మన్నారు.

నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డ పుడితే 10,116 రూపాయలు వారి పేర డిపాజిట్ చేస్తానని, అందరికి అనుకూలమైన ప్రదేశంలో వారసంతా షెడ్ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. తిమ్మాపూర్ మెయిన్ రోడ్డు దగ్గర కమాన్ ఏర్పాటు చేస్తానని, నిరుపేదలెవరైనా మరణిస్తే దహన సంస్కారాలకు 5016 రూపాయలు ఇస్తానన్నారు.

అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతోపాటు మానకొండూర్ చెరువు పక్క నుండి తారు రోడ్డు నిర్మాణం, ఎస్సీ స్మశాన వాటిక దగ్గర మినీ వాటర్ ట్యాంకు, బాత్రూంల నిర్మాణం చేయిస్తానన్నారు. అలాగే డబుల్ బెడ్రూం కాలనీలో డ్రైనేజీ సమస్య లేకుండా చేయిస్తానని, గ్రామ పంచాయతీ ముందు ఉన్న హనుమాన్ గుడి పునర్నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.