15 July, 2026 | 7:49 PM

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

15-07-2026 07:47 PM

- కళాశాల ప్రిన్సిపాల్ పాండురంగ శర్మ 

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మహిళలు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పాండురంగ శర్మ అన్నారు. బుధ వారం పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DM&HO) ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విద్యార్థినులకు మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, సమతుల్య పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, నివారణ, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ బీ లక్ష్మి, ఎన్ హెచ్ ఎం (NHM) శ్రీలత, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.