ఏప్రిల్ 14న బ్లూ, బ్లాక్, గ్రీన్ కవాతు
డాక్టర్ పిడమర్తి రవి
ముషీరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): ఏప్రిల్ 14న మూడు డిమాండ్ లతో బ్లూ బ్లాక్ గ్రీన్ షరట్స్ కవాతు, సభను నిర్వహించనున్నట్లు మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చీప్ పాట్రన్ పిడమర్తి రవి, పాట్రన్ సురేందర్ సన్నీ తెలిపారు. ఏప్రిల్ 14న సాయంత్రం నాలుగు గంటల నుండి బషీర్బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మందితో ర్యాలీ ఉంటుందని అన్నారు.
ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మా ట్లాడుతూ ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు 250 గజాల ఇవ్వాలని ఎస్సీలకు 20% బీసీలకు 42% ముస్లింల కు, గిరిజనులకు 12 శాతం ఇవ్వాలని కోరారు. అనంతరం ఉత్సవాల జయంతి కమిటీని ప్రకటించారు.
మహానీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్‌గా కొండల శ్రీనాథ్ రావు, అధ్యక్షుడిగా ఎండి రహీం, కన్వీనర్‌గా చందు నాయక్, మహిళా చైర్మన్‌గా కోట ఉషారాణి, కన్వీనర్‌గా వరలక్ష్మి, విద్యార్థి జేఏసీ చైర్మన్‌గా బోరెల్లి సురేష్, కన్వీనర్‌గా జోగు గణేష్, యూత్ కన్వీనర్‌గా నక్క మహేష్, అధ్యక్షుడిగా రింగు రాంబాబును నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర కన్వీనర్లుగా రాజు (వికారాబాద్), నక్క రమేష్ (పెద్దపల్లి), సంపత్, సిటీ కన్వీనర్‌గా జెర్రీపోతుల సాయన్న, కో కన్వీనర్లుగా పాలడుగు రమేష్, డాక్టర్ బొమ్మెర స్టాలిన్ మాడుగుల శివ, పిడమర్తి రాంబాబు, దేవరకొండ నరేష్‌లను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.




