కంటోన్మెంట్ బోర్డ్‌ను ఆదుకోవాలి
జంపన ప్రతాప్
సికింద్రాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): ఆదాయ వనరులు తగ్గి, ఆర్థికంగా దివాళా తీసిన కంటోన్మెంట్ ను ఆదుకోవాల్సిందిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, రక్షణ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ రవీంద్రను కోరారు. శనివారం కంటోన్మెంట్ బోర్డ్‌కు వచ్చిన ఆయనను ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా జం పన ప్రతాప్ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన 2009 మధ్య కాలంలో సీఈఓగా పనిచేసిన రవీంద్రతో నాటి పరిస్థితులపై చర్చించారు.
తదనంతర కాలంలో కంటోన్మెంట్ బోర్డ్ ఆదాయ మార్గాలు తగ్గడంతో నిధుల లేమి ఏర్పడిందని వివరించారు. అప్పట్లో మంచినీటి కోసం రూ.27 కోట్లు వెచ్చించినప్పటికీ, రూ.110 కోట్ల మిగులు ఉండటాన్ని గుర్తు చేశారు. సర్వీసు చార్జీల విడుదలలో భారీ కోత ఏర్పడిందనిన్నారు.
ఏటా రూ.30 కోట్ల మేర ఆదాయం వచ్చే టీపీటీ ని రాష్ట్ర ప్రభుత్వం తనఖాతాలోకి మళ్లించుకుంటుందని తెలిపారు. ఆక్ట్రాయ్, టోల్ ట్యాక్స్ రద్దు తో బోర్డు ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. కంటోన్మెంట్లో బిల్డింగ్ రెగ్యుల రైజేషన్ స్కీమ్ అమలు చేస్తే ప్రజలకు ఉపశమనంతో పాటు బోర్డు ఆదాయం పెరుగు తుందని ప్రతాప్ వివరించారు. 1939లోనే కంటోన్మెంట్ ట్రెంచింగ్ గ్రౌండ్ కోసం హస్మత్పేటలో కొనుగోలు చేసిన 29 ఎకరాలు, తుర్కపల్లిలోని 12 ఎకరాలు నిరుపయోగంగా ఉండటంతో కబ్జాకు గురవు తుందని జంపన ప్రతాప్ తెలిపారు. ఆయా అంశాలపై బోర్డు అధికారులతో సమీక్షించి, త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని పీడీ రవీంద్ర హామీ ఇచ్చారు.




