బిఎంఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ముకరంపుర, జూలై 23(విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద భారతీయ మజ్దూర్ సంఘ్ 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భారతీయ మజ్దూర్ సంఘ్ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో అతిపెద్ద కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తోందని అన్నారు. విద్యుత్ రంగంలో అహర్నిశలు శ్రమిస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్ రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి బి ఎం ఎస్ నిరంతరం పోరాటం చేస్తోందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు, కంపెనీ ప్రెసిడెంట్ గుగులోతు రాందాస్ నాయక్, జిల్లా అధ్యక్షులు జి. సురేందర్ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. ఫకీర్ దాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






