23 July, 2026 | 3:07 PM

దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందిస్తున్న శాన్వి

23-07-2026 02:34 PM

– నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

ముకరంపుర, జూలై 23(విజయక్రాంతి): సమాజంలో విద్య కేవలం వ్యాపారంగా మారుతున్న తరుణంలో, విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తూ దేశ సేవ చేసే దిశగా తీర్చిదిద్దుతున్న శాన్వి జూనియర్ కళాశాల మరియు డిఫెన్స్ అకాడమీ అభినందనీయమని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు.

నేర్చుకోవడానికి రండి... సేవ చేయడానికి వెళ్లండి అనే స్ఫూర్తిదాయక నినాదంతో యువతను సైన్యం, రక్షణ రంగం మరియు సామాజిక సేవ వైపు ప్రోత్సహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. శాన్వి జూనియర్ కళాశాల & డిఫెన్స్ అకాడమీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త అరెశెట్టి మునిందర్ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. వందలాది మంది విద్యార్థులను దేశానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషి సమాజానికి ఆదర్శమని కొనియాడారు. శాన్వి జూనియర్ కళాశాల అందిస్తున్న ఈ విలువైన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.