న్యాయం కోసం రోడ్డు ఎక్కినా కాంగ్రెస్ నాయకులు
జగదేవపూర్, (విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలో నీట్ పరీక్ష లికేజి,పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టు ను ఖండిస్తూ మండల అధ్యక్షులు కొంపెల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు కరుణాకర్ మాట్లాడుతు దేశంలో బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వం పూర్తిగా ప్రజలను విద్యార్థులను గోస పెడుతుంది అన్నారు. విద్య వ్యవస్థపై విద్యార్థులపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద లాటి చార్జ్ చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎండి అజీస్,బింగి నర్సింలు, రాగుల రాజు సర్పంచ్లు,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






