23 July, 2026 | 3:06 PM

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జువ్వాడి కృష్ణారావు

23-07-2026 02:36 PM

మల్లాపూర్, జూలై 23 (విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు తన ఎన్యూమరేషన్ దరఖాస్తు ఫారాన్ని సంబంధిత బూత్ స్థాయి అధికారికి సమర్పించారు. అనంతరం చిట్టాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలో వంద శాతం ఎన్యూమరేషన్ పూర్తి కావడం పట్ల వారిని అభినందించి, శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి మౌలిక వసతులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంపతి శంకరమ్మ, ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య, వార్డు సభ్యులు పబ్బతి రాజేష్, ఇట్టెడి శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.