నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా డా. బీఎన్ గంగాధర్
03-07-2024 09:47 PM
హైదరాబాద్: జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చైర్ పర్సన్‌గా డా. బీఎన్ గంగాధర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్‌ఎంసి మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అధ్యక్షునిగా ఉన్న గంగాధర్‌ను కొత్త చైర్ పర్సన్‌గా నియమిస్తూ కేబినెట్ అపాయింట్ మెంట్ కమిటీ బుధవారం వెల్లడించింది. ఆయన ఈ పదవిలో నాలుగేళ్ల పాటు కొనసాగనున్నారు. డా. సంజయ్ బెహ్రీని ఎన్‌ఎంసి మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అధ్యక్షునిగా నియమించారు. డా. అనిల్ డి క్రూజ్‌ను పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు సభ్యునిగా, డా. రాజేంద్ర అచ్యుత్‌ను అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు సభ్యునిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.






