18 May, 2026 | 2:27 AM

గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న బొడ్డు శంకర్

18-05-2026 12:21 AM

మాడ్గుల,మే17,(విజయక్రాంతి):  ఆదివారం భారతీయ విద్యా భవన్ చెన్నైలో జరిగిన ‘యునైటెడ్ అమెరికన్‘ యూనివర్సిటీ  నిర్వహించిన స్నాతకోత్సవంలో బొడ్డు శంకర్ కు డాక్టర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ లో గౌరవ డాక్టరేట్ పురస్కారం అందజేశారు. బొడ్డు శంకర్ వికలాంగులకు సేవలు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర, వివిధ సామాజిక రంగాలలో, నాయకత్వం, అంకితభావంతో చేసిన ప్రజా  సేవలను గుర్తించి బొడ్డు శంకర్  డాక్టర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ లో గౌరవ డాక్టరేట్ పురస్కారం యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ అమృతవల్లి,ఫౌండర్ డైరెక్టర్ వెంకటేషన్,గౌని నర్సింహ గౌడ్,యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. 

ఈ సందర్భంగా బొడ్డు శంకర్ మాట్లాడుతూ.. 22సంవత్సరాలుగా   వికలాంగులకు అందిస్తున్న సేవలు ,తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ,వివిధ సామాజిక రంగాలలో ప్రజల కోసం నేను చేస్తున్న సేవలను  ‘యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ‘(UAU) లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ వారు గుర్తించి  గౌరవ డాక్టరేట్ పురస్కారం అందజేయడం చాలా సంతోషంగా ఉంద న్నారు. నాకు గౌరవ పురస్కారం అందించిన యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు.