ఇదేం టెట్ గురూ!
- బోధించే సబ్జెక్ ఒకటి.. టెట్ సిలబస్ మరొకటి
- పరీక్ష విధానంపై ఉపాధ్యాయుల అభ్యంతరం
- డీఎస్సీ తరహాలోనే నిర్వహించాలని డిమాండ్
- సమీక్షకు కమిటీ వేయాలని విజ్ఞప్తి
- ఈనెల 21న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకే ఇప్పుడు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పెద్ద సవాల్‌గా మారింది. తాము బోధించే సబ్జెక్టులతో సంబంధం లేని అంశాలపై ప్రశ్నలు రావడంతో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న టీచ ర్లు అర్హత సాధించలేకపోతున్నారు.
రెండేళ్లలోపు టెట్ తప్పనిసరిగా అర్హత సాధిం చాలని గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు వెలువ రిచడంతో టెట్ పరీక్ష రాయాలంటేనే టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. పరీక్ష విధానం, సిలబస్‌లో మార్పులు చేసి, బోధించే సబ్జెక్టుకు సం బంధించి ప్రశ్నలు అడగాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల క్రితం బీఈడీ పూర్తి చేసిన తమను.. సంబంధం లేని సిలబస్ నుంచి ప్రశ్నలు అడగడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.
చెప్పేదొకటి.. రాసేది మరొకటి..
టెట్ పేపర్-1, పేపర్-2 రెండు పేప ర్లు ఉంటాయి. పేపర్ 1 ఎస్జీటీ (సెకండరీగ్రేడ్ టీచర్)లకు ఉంటుంది. వీరందరూ ఒకే పేపర్ రాస్తారు. వీరికి 3 వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ విభాగం లో ప్రశ్నలు ఉంటాయి. అలాగే డీఎడ్‌లో నేర్చుకున్న సైకాలజీ, మెథడాలజీ ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు విద్యాకమిటీలు, విద్యాహక్కు చట్టం, మూల్యాంకనంపై ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలకుగాను






