20 July, 2026 | 5:39 PM

Breaking News

వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •   శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •  

బోనమెత్తిన బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్

20-07-2026 12:00 AM

బోధన్, జులై19 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.  ఆదివారం సరస్వతి నగర్ లయోల పాఠశాల నుండి మిమ్స్ డి గ్రీ కళాశాల వరకు ఉన్న కాలానీల ప్రజలు పోతరాజులతో కలిసి భాజా బజంత్రీలతో కొత్త బస్ స్టాండ్ మీదుగా బయలుదేరి నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మ వారికి బోనాలు సమర్పించారు. అనంతరం షర్బతి కెనాల్ ప్రాంతంలో గల మహాలక్ష్మి అమ్మ వారికి బోనాలు సమర్పించారు.  ఈ సందర్బంగా బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు