అంగన్వాడీ కేంద్రాలు అస్తవ్యస్తం
ఒకే భవనంలో రెండు సెంటర్ల నిర్వహణ!
మహబూబాబాద్, జులై 19 (విజయక్రాంతి): మాతా శిశు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలు మహబూబాబాద్ జిల్లాలో అసౌకర్యాలకు నిలయంగా మారాయి. అనేకచోట్ల అంగన్వాడీ కేంద్రాల కు సొంత భవనాలు లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మరి కొన్ని చోట్ల సొంతభ వనాలు ఉన్నప్పటికీ వసతి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొ న్నిచోట్ల సరైన వసతి లేక ఒకే భవనంలో రెం డు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నా రు. ఫలితంగా తమ ఆవాస ప్రాంతం నుండి మరోచోటికి బాలింతలు చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు వెళ్లి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,437 అంగన్వాడీ కేంద్రా లు ఉన్నాయి. ఇందులో కేవలం 341 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండ గా, 620 అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంబంధిత శాఖల కు చెం దిన ఉచిత భవనాల్లో నిర్వహిస్తున్నారు. మ రో 474 అంగన్వాడి కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో 39 వేల 068 మంది చిన్నారులకు, 3,738 మంది గర్భిణులు, 3,817 మంది బాలింతలకు ప్ర భుత్వాలు అందజేస్తున్న పౌష్టికాహారం, ఆటపాటలతో విద్యాబోధన, ఇతర సంక్షేమ పథ కాలను అమలు చేస్తున్నారు.
అయితే అటు సొంతభవనాలు, అద్దె భవనాలు, ఉచిత భవనాల్లో సరైన వసతులు లేక నిర్వాహకులు, చంటి పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతున్నారు. వెయ్యికి పైగా అంగన్వాడి కేంద్రాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. అలాగే 343 కేంద్రాల్లో తాగునీటి వసతి లేదు.
645 కేంద్రాల్లో సరైన విద్యుత్తు సౌకర్యం లేదు. 767 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్ర శాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒకే గది లో సామాగ్రి నిల్వ చేయడం, చిన్నారులను అక్కడే ఉంచి ఆటపాటలతో విద్యాబోధన నేర్పించడం, అంగన్వాడీ కేంద్రం నిర్వహణ కోసం ఇరుకు గదిలో ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాల్లో సొంత భవనాలు లేక, అద్దె భవనాలు లభించక, రెండు క్లబ్ చేసి ఒకే గదిలో రెండు సెంటర్లు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
దీనితో ఇద్దరు టీచర్లు, ఇద్దరు ఆయాలు, రెండు సెంటర్ల కు సంబంధించి పిల్లలు, తల్లులు ఒకే చోట ఉం డడానికి అనేక అవస్థలు పడుతున్నారు. దీని తో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అంగన్వాడి కేంద్రాలకు ఈ వేసవికాలంలో విద్యుత్ సౌకర్యం కల్పించడానికి మీటర్లు బిగించారు. చాలా చోట్ల అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, ఫ్యాన్లు లైట్లు బిగించకుండా వదిలేశారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి ఆవాస కేంద్రంలో అంగన్వా డి కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి, సౌకర్యాలు కల్పించి స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలను పగడ్బందీగా అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






