15 April, 2026 | 10:40 AM

ఆరుగురు మావోయిస్టుల మృతదేహాల గుర్తింపు

14-11-2025 12:46 AM

వారిపై రూ.27 లక్షల రివార్డు

చర్ల, నవంబర్ 13 (విజయక్రాంతి): చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతాబలగాలు గుర్తించాయి. ఈ ఉమ్మడి ఆపరేషన్ బీజాపూర్‌లోని డీఆర్జీ, దంతెవాడలోని డీఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) బృందాలు నిర్వహించాయి.

జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలోని కందుల్నార్, కాచలారామ్  గుజ్జకొంట అడవుల్లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రూ.27 లక్షల రివార్డ్‌తో ఉన్న ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. వారిలో డీసీసీఎం కన్నా అలియాస్ బుచ్చన్న (8 ఇతని తలపై లక్షల రివార్డు ఉంది), డీవీసీఎం ఊర్మిళ (రూ.8 లక్షల రివార్డు), ఏసీఎం జగత్ తమో అలియాస్ మోటు (5 లక్షల రివార్డు), పీఏం దేవే (2 లక్షలు రివార్డు), పీఏం భగత్ (2 లక్షలు రివార్డు), పీఎం మంగళి ఓయం (2 లక్షల రివార్డ్) ఉన్నారు.

వారి నుంచి రెండు రైఫిల్స్ (68 కార్ట్రిడ్జ్‌లతో), ఒక 9 ఎంఎం కార్బున్, ఒక 303 రైఫిల్, ఒక సింగిల్ షాట్ రైఫిల్, ఒక 12 బోర్ గన్, హ్యాండ్ గ్రెనేడ్‌లు, రేడియో, స్కానర్, మల్టీమీటర్, సేఫ్టీ ఫ్యూజ్, భారీ మొత్తంలో మావోయిస్టు సాహిత్యం, యూనిఫాం లు వైద్య సామగ్రి ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను భద్రతా దళాలకు పెద్ద విజయంగా భావి స్తున్నారు.

కాగా 2025లో ఇప్పటివరకు జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో 144 మంది నక్సలైట్లు మృతి చెందా రని, 499 మందిని అరెస్టు చేశారని, 560 మంది లొంగిపోయారని బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. జనవరి 2024 నుండి మొత్తం 202 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్‌లో హతమయ్యారని, 1,002 మంది అరెస్టు కాగా, 749 మంది లొంగిపోయారని తెలిపారు.