14-11-2025 12:45:51 AM
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి వెలమ ఫంక్షన్ హాల్‌లో గురువారం ప్రముఖ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తాటిపాముల రాజగోపాల్ గౌడ్ కుమార్తెను రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మేనల్లుడి కి వివాహము జరిపించారు. ఈ వివాహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో పాటు కలెక్టర్ ఆశిష్ సంగు వాన్, ఎస్పి రాజేష్ చంద్ర పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి, లింగాగౌడ్, వడ్ల రాజేందర్, ఆకుల శ్రీనివాస్, వడ్ల భీమయ్య తదితరులు కలిసి మంత్రిని సన్మానిoచారు.