14-11-2025 12:47:25 AM
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, నవంబర్ 13 (విజయ క్రాంతి): పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా సిఎంఆర్‌ఎఫ్ పథకం కలిపిస్తుందని రాస్తా ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎంఆర్ ఎఫ్ ఆయన పంపించేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడి అప్పుల పాలైన వారికి ఈ ఆర్థిక సాయం కొంత ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్ర కరణ్ రెడ్డి, మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఐరేని సందీప్ కుమార్, పుట్నాల శ్రీనివాస్ యాదవ్, కోయల్ కర్ కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
జీఆర్ కాలనీ సమస్యలను పరిష్కరించాలని షబ్బీర్ అలీకి వినతి
కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి జి ఆర్ కాలనీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని కాలనీవాసులు గురువారం కామారెడ్డి లో షబ్బీర్ అలికి వినతి పత్రాన్ని అందజేశారు.
చెరువు అలుగు, కాలువ బ్రిడ్జి పైపులు పెంచాలని, డివైడర్ ఎత్తు తగ్గించాలని వినతి పత్రంలో కోరినట్లు కాలనీవాసులు తెలిపారు. జి ఆర్ కాలనీలోకి వరద నీరు రాకుండా శాశ్వత పనులు చేపట్టాలని కోరారు. వింజమూరి రాములు, శ్రీనివాస్, కైరం కొండ స్వామి, మురళి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.