బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి
కొత్త వాటర్ లైన్లు, వాటర్ జంక్షన్లు ఏర్పాటు చేయాలి
జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్-చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ జోనల్ కమిషనర్‌ను కలిసి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రహదారి విస్తరణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే తాగునీటి సరఫరా ప్రెషర్‌ను పెంచడంతో పాటు కొత్త వాటర్ లైన్లు, కొత్త వాటర్ జంక్షన్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు మెరుగైన రహదారులు, నిరంతర తాగునీటి సరఫరా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బలోపేతమైన నీటి పంపిణీ వ్యవస్థ ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అజయ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.






