29 June, 2026 | 11:00 PM

ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు

29-06-2026 09:57 PM

శ్రీ గురు పీఠం ఫౌండర్ అండ్ చైర్మన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగోని జిన్నారం శివకుమార్ గౌడ్ !!

శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ గురు పీఠం లోని దత్తాత్రేయ మహా స్వామి పంచాయతనం దేవాలయం, పంచవటి, శ్రీ షిరిడి సాయినాథ దేవాలయంలో ఈరోజు ఏరువాక పూర్ణిమ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనంలో అభిషేకం అర్చన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో కాకడ హారతి మధ్యాహ్నం హారతి ఇవ్వడం జరిగినది. శ్రీ గురు పీఠం ప్రాంగణంలో పారిజాత వృక్షాలను నాటారు. శాస్త్రుల నటరాజ్ శర్మ మరియు శాస్త్రుల శ్రీ హర్ష  ఆధ్వర్యంలో పూజాక్రతువులు జరిగాయి. శ్రీ సాయి మధ్యాహ్న హారతి తదనంతరం పద్మా రావు వెంకటలక్ష్మి దంపతులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. 

ఈ సందర్భంలో శ్రీ గురు పీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెద్దగౌని శివ కుమార్ గౌడ్  ఆధ్వర్యంలో అర్చకులు మెదక్ జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్   సువాసి రెడ్డి , శివంపేట్ పిఎసిఎస్ చైర్మన్  చింతల వెంకటరామిరెడ్డి ,  పద్మా రావు వెంకట్ లక్ష్మి దంపతులను శ్రీ షిరిడి సాయిబాబా శాలువతో సత్కరించారు.  ట్రస్ట్ సభ్యులు పద్మారావు వెంకట్ లక్ష్మి దంపతులను ఆశీర్వదిస్తూ ఆ దత్తాత్రేయ స్వామి గురుపరంపర శిరిడి సాయి నాధుల ఆశీస్సులు వారికి ఎల్లవేళలా లభించాలని వారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి పిఎసిఎస్ సీఈవో   మధు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, గుడూరు గ్రామపంచాయతీ సర్పంచ్ బేగరి నర్సయ్య, తాజా మాజీ సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, కొత్తపేట యాదగిరి, భాస్కర్ గుప్తా, శ్రీ గురు పీఠం సమన్వయకర్త కొంతాన్ పల్లి సత్యనారాయణ గౌడ్, రాజేందర్ రెడ్డి, విశ్వ శ్రీ లా చాంబర్స్, నాగేంద్ర, కొండల్, అర్జున్, బల్కంపేట నాగరాజ్, బల్కంపేట కిరణ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.