calender_icon.png 11 January, 2026 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మక్క గుట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

09-01-2026 12:00:00 AM

భీమదేవరపల్లి జనవరి 8 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూ ర్ సమ్మక్క సారలమ్మ గుట్ట సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు గురువారం ఉదయం గుట్ట ప్రాంతంలో అచేతన స్థితిలో వ్యక్తి పడి ఉన్నట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

మృతుని ఒంటిపై గాయాలతోపాటు అతని చాతిపై ఆంగ్ల అక్షరాలతో అమ్మ అనే పచ్చబొట్టు కలిగి ఉన్నట్లు ముల్కనూర్ ఎస్‌ఐ రాజు తెలిపారు. మృ తుని వయసు సుమారు 30 నుండి 40 సంవత్సరాలు ఉంటుందని ఆ యన  తెలిపారు.  మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు కొనసాగిస్తున్నామని, మృతు ని వివరాలు తెలిసిన వారు ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.