09-01-2026 12:00:00 AM
పాకాల చెరువులో వదిలిన అటవీశాఖ అధికారులు
మహబూబాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జి ల్లా గూడూరు మండలం సీతానగ రం గ్రామపంచాయతీ పరిధిలోని భూక్య దస్రు తండాకు వెళ్లే రాళ్ల వా గు బ్రిడ్జిపై బుధవారం రాత్రి తండా యువకులకు మొసలి కనిపించింది. వెంటనే అప్రమత్తమైన యువకులు చేపల వలలతో మొసలిని బంధించి, గూడూరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు, యువకుల నుండి మొ సలిని స్వాధీనం చేసుకుని, పాకాల చెరువులో వదిలేశారు.