9 August, 2026 | 2:54 PM

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

08-08-2026 12:18 PM

సిద్దిపేట క్రైం, ఆగస్టు 8(విజయక్రాంతి) : సిద్దిపేట కోమటిచెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి ఒంటిపై లేత పసుపు రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ఉన్నాయి. నీటిలో తేలిఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.