calender_icon.png 2 February, 2026 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో దారణ హత్య

02-02-2026 11:40:16 AM

హైదరాబాద్: కామారెడ్డి(Kamareddy) జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కామారెడ్డిలోని ఓ ప్రార్థనామందిరం కాంపౌండ్ లో మృతదేహం లభ్యమైంది. దుండగులు మృతదేహాన్ని ముక్కలు చేసి చెత్తకుప్పలో పడేశారు. చెత్త కుప్పలో లభించిన సంచిలో కాళ్లు, మొండం బయటపడ్డాయి. కనిపించని తల, చేతులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి సగభాగాన్ని చర్చి ఆవరణలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.