02-02-2026 12:16:51 PM
హైదరాబాద్: సిట్ అధికారుల విచారణలో ఏం జరిగిందో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) చెప్తారని అనుకుంటున్నట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత(Telangana Jagruthi President Kavitha) సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. రెండేళ్లవుతున్నా... ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపునకు రావట్లేదని విమర్శించారు. విచారణకు త్వరగా ముగింపు పలకాలి.. దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
సిట్ విచారణను తప్పుపడుతూ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) మాట్లాడటం కరెక్టు కాదని సూచించారు. చట్టాలను అందరూ గౌరవించాలి, సహకరించాలని కోరారు. గుంటనక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలిస్తే వెళ్తానని ఆమె తెలిపారు. తన ఫోన్, తన భర్త ఫోన్ ట్యాప్ అయినట్లు తనకు అనుమానాలున్నాయని స్పష్టం చేశారు. సిట్ అధికారులు పిలిస్తే వెళ్లి విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు.