గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
రాజేంద్రనగర్ మార్చి 14 (విజయక్రాంతి): మంచిరేవుల సమీపంలో శనివారం గుర్తు తెలియని మహిళా శవం లభించినట్లు నార్సింగి ఎస్ హెచ్ ఓ హరికృష్ణనరెడ్డి తెలిపారు. సంఘటనకు సంబం ధించి ఎస్‌హెచ్‌ఓ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. టీజీపీఏ జంక్షన్ నుం డి మంచిరేవుల సర్వీస్ రోడ్కు వెళ్లే మార్గం లో రోడ్డు పక్కన ఉన్న పొదల్లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో నార్సింగి పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి న స్థితిలో ఉండుట వలన ముఖం పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా తయారు అయింది మృతురాలి వయస్సు సుమారు 55 నుండి 65 సంవత్సరాలు ఉండవచ్చునని మృతురాలి తలకు తెల్లటి జుట్టు ఉన్నది. మృతురాలు పసుపు రంగు చీరపై నారింజ రంగు గీతలు, పసుపు రంగు బ్లౌజ్ లంగా ధరించినట్లు హరికృష్ణ రెడ్డి తెలిపారు.
మృతురాలి గుర్తింపు సంబంధించిన ఆనవాళ్లు తెలియరాలేదనీ మృతదేహానికి పంచనామా నిర్వ హించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎవరైనా మహిళ తప్పిపోయి ఉన్నట్లు గా ఉంటే నార్సింగి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని 478/2026, యు.ఎస్ 194 బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందనీ మృతదేహానికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిసిన పక్షంలో నార్సింగి పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్లు 8712663110, 87125 68392, 8712571928 మరియు 87126 63119 ను సంప్రదించాలని ఎస్ హెచ్ ఓ హరికృష్ణ రెడ్డి తెలిపారు.




