ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు ప్రారంభం
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్
4665 మంది విద్యార్థులకు గాను 18 మంది గైర్హాజరు
ముషీరాబాద్, మార్చి 14(విజయక్రాంతి): ముషీరాబాద్ మండలి పరిధిలో శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ముషీరాబాద్ విద్యా మండలి పరిధిలో 4665 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 18 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ముషీరాబాద్ విద్యా మండలి ఉపవిద్యాధికారి సుజాత తెలిపారు. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రాలకు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పి పరీక్ష కేంద్రాలకు పంపించారు.
ప్రభుత్వం విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబు తూ ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఫోటోలతో ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేసింది. రాంనగర్ సెంట్ ఫ్రాన్సిస్ హై స్కూల్, జామా ఉస్మానియా హైస్కూల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి పరీక్ష కేంద్రాలను సందర్శించి తనిఖీలు చేశారు. భోలక్ పూర్ లోని అంజుమన్ హై స్కూల్ లో ఒకే చోట ఇంగ్లీష్ మీడి యం, రెండు ఉర్దూ మీడియం పరీక్ష కేంద్రా లు ఒకే చోట ఏర్పాటు చేయడంతో విద్యార్థులు కొంత ఆందోళనకు గురయ్యారు.
విద్యార్థులకు పెన్నులు పంపిణీ
ముషీరాబాద్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పి. శ్రీధర్‌చారి ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులను కలిసి ఆల్ ది బెస్ట్ చెబుతూ పెన్ను, స్కేల్‌లను అందజేశారు. పరీక్షలు బాగా రాసి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.




