22 July, 2026 | 1:37 PM

నింగిలోకి బోయింగ్ రాకెట్

07-06-2024 02:16 AM

ఐఎస్‌ఎస్‌కు బయల్దేరిన సునితా విలియమ్స్

కేప్‌కెనరావల్, జూన్ 6: ఎట్టకేలకు బోయింగ్‌కు చెందిన స్టార్‌లై నర్ వ్యోమనౌక నింగిలోకి పయనమైంది. ఈ నౌకలో భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి (ఐఎస్‌ఎస్) బయల్దేరారు. ఇవాళ ఉదయం ఈ కేంద్రానికి చేరుకుంటారు. ఇక్కడ వారం పాటు వారు ఉంటారు. తిరిగి స్టార్‌లైనర్‌లో భూమిపైకి తిరిగొస్తారు. గత నెల రోజులుగా ఈ నౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతు న్నాయి. కానీ ప్రతిసారి సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. చివరకు మూడో ప్రయత్నంలో బుధవారం ఈ వ్యోమనౌక నింగిలోకి ఎగిరింది.