స్టాక్‌మార్కెట్‌లో భారీ కుంభకోణం
రిటైలర్లను ముంచిన మోదీ, షా
షేర్లు కొనుక్కోమని వారెలా చెప్తారు?
తమవారికి లాభం చేకూర్చేందుకే ప్రకటనలు
రాహుల్‌గాంధీ మండిపాటు
న్యూఢిల్లీ, జూన్ 6: లోక్‌సభ ఎన్నికలను అడ్డంపెట్టుకొని నరేంద్రమోదీ, అమిత్ షా దేశ చరిత్రలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ పాపంలో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా పాత్ర ఉన్నదని విమర్శించారు. ఈ కుంభకోణంలో రిటైల్ పెట్టుబడిదారులు ఏకంగా రూ.30 లక్షల సంపదను కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘దేశ చరిత్రలో మొదటిసారి ఎన్నికల సమయంలో ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఆర్థికమంత్రి స్టాక్‌మార్కెట్ గురించి ప్రకటనలు చేశారు. స్టాక్‌మార్కెట్ వేగంతో పరుగులు పెడుతోందని ప్రధాని అన్నారు. జూన్ 4న స్టాక్ మార్కెట్ అమాంతం పెరుగుతుందని, మదుపర్లు పెట్టుబడులు పెట్టాలని షా ప్రకటించారు.
నిర్మలా సీతారామన్ కూడా అలాంటి ప్రకటనే చేశారు. జూన్ 4 కంటే ముందే షేర్లు కొనుక్కోవాలని మే 19న షా సూచించారు. జూన్ 4న స్టాక్ మార్కెట్ రికార్డులు బద్దలు కొడుతుందని మోదీ చెప్పారు. జూన్ 3, 4 తేదీలో స్టాక్‌మార్కెట్ అన్ని రికార్డులను బద్దలు కొట్టి అథఃపాతాళానికి పడిపోయింది’ అని తెలిపారు. ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దర్యాప్తు జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు. స్టాక్ మార్కెట్లను తప్పుదోవ పట్టి స్తోందని ఆరోపణలున్న మీడియా సంస్థకు వాళ్లు ఎందుకు ఇంట ర్వ్యూలు ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీకి ౨౦౦ సీట్లు వస్తాయని తెలిసినా ఎగ్జిట్ పోల్స్‌లో కావా లనే ఎక్కువ అంకెలు చెప్పారని దుయ్యబ ట్టారు. బీజేపీకి, నకిలీ ఎగ్జిట్ పోల్స్ సంస్థల కు సంబంధం ఏంటని నిలదీశారు.






