కేంద్ర హోంశాఖ ఆఫీసుకు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపు ఈమెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా బుధవారం కూడా నార్త్ బ్లాక్ లోని హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయాన్ని పేల్చివేస్తామని ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కు బెందిరింపు ఈమెయిల్ దుండగులు పంపించారు. సమాచారం అందినవేంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఘటనాస్థలిలో తనిఖీలు చేపట్టారు. ప్రమాదస్థలానికి 2 అగ్నిమాపక యంత్రాలను పంపిన అధికారులు, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లే మార్గాల్లో భద్రత కట్టుదిటం చేశారు. నార్త్ బ్లాక్ నుంచి ఉద్యోగులలను బయటలకు వెళ్లాలని సూచించి, ఆ వైపు వెళ్లే రెండు ప్రధాన మార్గాల్లో భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేసి, కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాయి. ఇటీవల ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు ఇదే తరహలో బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.






