ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసిన హైకోర్టు
బెంగాల్: కోల్ కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కోల్ కతా హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2010కి ముందునాటి ఓబీసీ సర్టిఫికెట్లు, ఓబీసీ సర్టిఫికెట్లతో పొందిన ఉద్యోగాలు చెల్లుతాయని హైకోర్టు తెలిపింది. 1993 చట్టం ప్రకారం బీసీ కులాల జాబితా తయారు చేయాలని కోర్టు సూచించింది. జాబితా తయారీ బాధ్యతను బీసీ కమిషన్ కు అప్పగిస్తున్నట్లు తెలిపింది. బీజేపీ కుట్రతో కూడిన తీర్పును అంగీకరించబోమని, ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వం 2011లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఈ ఉత్తర్వులను తమ ప్రభుత్వం అంగీకరించదని మమతా బెనర్జీ చెప్పారు. ఇది బీజేపీ కుట్ర అని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ కోటా కొనసాగుతుందని మమత అన్నారు. ఇంటింటికి సర్వే నిర్వహించి ముసాయిదా బిల్లును రూపొందించామని, కేబినెట్, అసెంబ్లీ ఆమోదించిందని, కోర్టు ఆదేశాలపై స్పందించారు.






