12 August, 2026 | 1:21 PM

రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ

18-06-2024 06:33 PM

ఉత్తర ప్రదేశ్: దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో పర్యటించారు. వారణాసిలో నిర్వహించిన కిసాన్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో 17వ విడత పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్ల 26 లక్షల మంది రైతులకు లబ్దిదారులున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతులందరి ఖాతాల్లో రూ. 2000 చొప్పున మొత్తం రూ.20 వేల కోట్లు జమ చేశారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ.3.24 లక్షల కోట్లు బదిలీ చేశారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. 30 వేల మందికి పైగా స్వయం సహాయక బృందాలకు కృషి అనే సర్టిఫికెట్లు ప్రధాని మోదీ అందజేశారు.