09-12-2025 08:29:38 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు(Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపులు వెల్లువెత్తాయి. శంషాబాద్ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ ఈ మెయిల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. టేకాఫ్ అయిన 10 నిమిషాల్లోనే పేల్చేస్తామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. బాంబు పేలొద్దంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ హెచ్చరించారు. మెయిల్ పంపిన వ్యక్తి అమెరికాకు చెందిన జాస్పర్ పక్టార్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణమే అప్రమత్తం విమానంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ విమానాశ్రయంలో మూడు విమానాలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు తక్షణమే అప్రమత్తమై తనిఖీలు చేశారు.