calender_icon.png 9 December, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

09-12-2025 07:45:32 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టరేట్లలో నేడు తెలంగాణ తల్లి విగ్రహాలు(Telangana Talli Statues) ఆవిష్కరణ జరగనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు.  రూ. 5.8 కోట్లతో 33 జిల్లాల్లోని కలెక్టరేట్లలో 18 అడుగుల ఎత్తయిన తెలంగాణ తల్లి విగ్రహాలను నిర్మించారు. ఇవాళ 27 కలెక్టరేట్ల ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించనున్నారు. మిగతా 6 జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్,  ములుగు, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో  విగ్రహాల నిర్మాణం  పూర్తి కాలేదని అధికారులు పేర్కొన్నారు.