3 July, 2026 | 8:45 PM

Breaking News

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •  

బొమ్మ సోకురో.. బొంబాయి జాతరే..

26-07-2024 12:05 AM

‘మిస్టర్ బచ్చన్’ నుంచి ఇటీవల విడుదలైన సితార సాంగ్ ఇంకా సంగీత ప్రియుల చెవిలో మోగుతూనే ఉంది. అంతలో మరో పాటను విడుదల చేసింది ‘మిస్టర్ బచ్చన్’ టీమ్. ఈ మారు డప్పుల ‘దరువు’తో రవితేజ శైలికి సరిపడా మస్తు మాస్ గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు దర్శకు డు హరీష్ శంకర్. ఇటీవల కాలంలో ఇలాంటి పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు గేయ రచయిత కాసర్ల శ్యామ్. ఈ సినిమా కోసం ఆయన రాసిన ‘బొమ్మ సోకురో.. బొంబాయి జాతరే..’ అనే పాట గురువారం సాయంత్రం విడుదలైంది.

మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఈ మాస్ పాట ను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ కలిసి పాడగా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కలిసి హుషారైన స్టెపులతో అలరించారు. భాను మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్లో కనపడనున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతా కంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ‘మిస్టర్ బచ్చన్’.