calender_icon.png 22 July, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బర్త్‌డే విషెస్ తెలుపుతూ..

26-07-2024 12:05:00 AM

‘ప్రతినిధి 2’ సినిమాతో కొంత విరామం తర్వాత తెరమీదికొచ్చిన రోహిత్, ‘సుందరకాండ’తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాకు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. ప్రేమకథా చిత్రంగా రానున్న ఈ సినిమాలో విర్తి వాఘని హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా గురువారం రోహిత్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రం బృందం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ‘ఏ రెండు ప్రేమ కథలు ఒక్కటి కావు’ అంటూ ఓ వైవిధ్యమైన ప్రేమకథను తెరమీదికి తీసుకురానున్న మేకర్స్.. త్వరలో  టీజర్ ను విడుదల చేయనున్నట్టు తెలిపారు.