25 August, 2026 | 11:54 AM

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు

25-08-2026 11:22 AM

PCC, హైకమాండ్‌కు కమిటీ నివేదిక

క్రమశిక్షణ ఉల్లంఘనపై చర్యలకు సిఫార్సు

సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా?

చర్యలపై కాంగ్రెస్‌ అధిష్టానంలో ఉత్కంఠ

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆచితూచి నిర్ణయం!

 బీసీ మహిళా సెంటిమెంట్ ఆమెకు కలిసొస్తుందా..?

హైదరాబాద్ ఆగస్టు25(విజయక్రాంతి):  కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి వ్యవహారంపై కమిటీ PCC, పార్టీ హైకమాండ్‌కు నివేదిక సమర్పించనుంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనపై చర్యలు తీసుకోకపోతే కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కమిటీ అభిప్రాయపడింది. దీంతో మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా..? ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తుందా.? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.

మరొవైపు కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే.. తెలంగాణ రాష్ట్రంలో రానున్న మున్సిపల్ కార్పరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దెబ్బ పడుతుంది భావిస్తోంది. ఎందుకంటే.. వంగల్ ప్రాంతంలో కొండా సురేఖకు బలమైన పట్టు ఉంది. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తే.. బీసీ మహిళ సెంటిమెంట్ కొండాకు పెరిగే అవకాశం ఉంటుంది..ఇదీ కాంగ్రెస్ నష్టం కలిగే అకాశం ఉంటుంది. కాబట్టి కొండా సురేఖ వ్యవహారాన్ని తొందరపడి కాకుండా.. ఈ వ్యవహారంలో పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరోవైపు పార్టీ చర్యలు తీసుకోకుంటే..  కొండాపై అసమ్మతి వర్గం నుంచి ఒత్తిడి కలిగే అవకాశం కూడా ఉంది.