మంజులాపూర్ పాఠశాలలో బోనాల ఉత్సవం
07-08-2026 03:55 PM
నిర్మల్,(విజయక్రాంతి): మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో "బోనాలు "ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారి నైవేద్యాన్ని భక్తి శ్రద్ధలతో సమర్పించారు. విద్యార్థుల వేషధారణ మరియు కార్యక్రమాలు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ ఉపాధ్యాయులు హేమలత, సంతోష్, రాజేందర్, మోరె శ్రీనివాస్, మసియుద్దీన్, విద్యా రాణి, సత్తయ్య, సునీత, ముత్తన్న, రాజ్ కుమార్ పాల్గొన్నారు.






