20 March, 2026 | 5:14 AM

నేడు మాసంపల్లిలో బోనాల పండగ

20-03-2026 12:19 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 19 (విజయ క్రాంతి): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని మాసంపల్లి గ్రామంలో ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ ఆలయాల వద్ద నేడు బోనాల పండగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ పెద్దపట్ల సునంద కిషన్ రెడ్డి, గ్రామ పెద్దలు తెలిపారు.రేపు కుస్తీల పోటీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఉగాది పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని మాసంపల్లి గ్రామాల చుట్టుపక్కల గ్రామాలైనటువంటి, అక్కంపల్లి, వెంకంపల్లి, ఆత్మకూర్, జలాల్పూర్, అచ్చయాపల్లి, రామక్కపల్లి తదితర గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ ఆలయాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎడ్లబండ్ల ప్రదర్శనను తిలకించారు.