మల్లన్న ఆలయంలో పంచాంగ శ్రావణం
కొమురవెల్లి, ఫిబ్రవరి 19 కొమురవెల్లి మల్లన్న ఆలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని ఆలయ వర్గాలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు ముందుగా మల్లన్న స్వామి పేరుమీద పంచాంగ శ్రవణాన్ని భక్తులకు వివరించారు. మల్లన్న స్వామికి పరాభవ సంవత్సరానికి సంబంధించి ఆదాయం 7 వ్యయం _7 గాపేర్కొంటూ మిగతా రాసుల వారి ఆదాయం,వ్యయం గౌరవం, అగౌరాల గురించి వివరించారు.
ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండుతాయి అన్నారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారని పేర్కొన్నారు. అంతకుముందు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని విశేష అలంకరణలతో అలంకరించి అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం, మహా నివేదన, మహా మంగళహారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో కృష్ణ ప్రసాద్, నరసింహారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఏఈఓ లు రావుల సుదర్శన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




