22 July, 2026 | 3:53 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష   •   ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •  

ఢిల్లీలో ముగిసిన బోనాల ఉత్సవాలు

11-07-2024 12:06 AM

బంగారు బోనం ఎత్తుకున్న తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 

మహేశ్వరం, జూలై 10: ఢిల్లీలో మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించిన లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా దేవాలయ కమిటీ చైర్మన్ సీ రాజేందర్ యాదవ్, కన్వీనర్ జీ అరవింద్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మొద టి రోజు ప్రముఖులు ఎగ్జిబిషన్ తిలకించారు. రెండో రోజు ఇండియా గేట్ వద్ద ఘటాల ఊరేగింపు వేడుకలను నిర్వహించగా, హర్యా నా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. బుధవారం నిర్వ హించిన వేడుకల్లో జోగిని రాకేశ్ నెత్తిన బంగా రు బోనం ఎత్తుకొని ఢిల్లీ వీధుల్లో  నృత్యం చేయడం ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బంగారు బోనం నెత్తిన ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. లాల్‌దర్వాజ సింహవా హిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు.