22 July, 2026 | 4:25 PM

బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

22-07-2026 03:32 PM

బెజ్జంకి: మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బెజ్జంకి మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో వినోద్ కుమార్ చేసిన సేవలను కొనియాడుతూ, ప్రజాసేవలో ఆయన మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.