విద్యార్థుల స్కాలర్‌షిప్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!
- ఆగస్టు 24 వరకు గడువు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు ఆగస్టు 24 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నిర్దేశిత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అవసరమైన ధ్రువపత్రాలతో పాటు దరఖాస్తులను ప్రధానోపాధ్యాయుల ద్వారా ధృవీకరించి సెప్టెంబర్ 1లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సమర్పించాలని తెలిపారు. ఎన్‌ఎంఎంఎస్ పరీక్షను డిసెంబర్ 1, 2026న నిర్వహించనున్నట్లు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.






