22 July, 2026 | 4:22 PM

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష

22-07-2026 03:52 PM

హైదరాబాద్: ఎస్ఐఆర్(SIR)పై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కమిటీతో కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) సమావేశం అయ్యారు. కేటీఆర్ క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. సర్ ప్రక్రియను అందరూ సీరియస్ గా తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. ఆగస్టు 3 లోపు అందరూ ఎన్యుమరేషన్లు ఇచ్చేలా చూడాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నోటీసులు వచ్చాక అసలు పని ప్రారంభం అవుతూందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షల ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేవని తెలిపారు. అందుబాటులో లేని లక్షల మందిని నోటీసుల జారీ విభాగంలో చేర్చారని వివరించారు. ఓటర్లకు నోటీసులు అందిన వెంటనే పార్టీ శ్రేణులు అప్రమత్తం కావాలని కేటీఆర్  నిర్దేశించారు. అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలన్నారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ(MLC L. Ramana) ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేటీఆర్‌కు వివరించింది.