వార్డు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ బోనాల శ్రీకాంత్
కరీంనగర్ 46వ డివిజన్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా శ్రీకాంత్ పోటీ
కరీంనగర్, ఫిబ్రవరి9 ( విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ 46వ డివిజన్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బోనాల శ్రీకాంత్ వైపు గెలుపు ఏకపక్షంగా మారుతోంది. గత పదేళ్లుగా ఈ వార్డుతో బోనాల కుటుంబానికి ఉ న్న విడదీయలేని అనుబంధం, ప్రజా సేవ లో ఆయన కనబర్చిన అంకితభావమే నేడు శ్రీకాంత్ విజయ తీరాలకు చేరువ చేస్తున్నా యి. కేవలం ఎన్నికల సమయంలో కనిపించే నాయకుడిలా కాకుండా, గత దశాబ్ద కాలం గా వార్డు ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి కావడమే ఆయనకు శ్రీరామరక్షగా నిలుస్తోంది.
డివిజన్‌ను అభివృద్ధి పథంలో పరు గులు పెట్టించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అం దించడం, బురదమయంగా ఉన్న వీధులను సీసీ రోడ్లుగా మార్చడం, ఆధునిక డ్రైనేజీ వ్య వస్థను నిర్మించడం వంటి పనులు బోనాల మార్కు అభివృద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. నియో జకవర్గ స్థాయిలో బ లమైన పట్టున్న ఎ మ్మెల్యే, మాజీ మం త్రి గంగుల కమలాకర్ స్వయంగా శ్రీకాంత్ పనితీరును ప్రశం సించడం,
ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడని కితాబివ్వడం సా మాన్య ఓటర్లలో సైతం భరోసాను పెం చింది.ఏ అర్ధరాత్రి ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా, మరేదైనా ఆపద తలెత్తినా వెంటనే స్పందించే గుణం శ్రీకాంత్ ను ప్రజా నాయకుడిగా నిలబెట్టింది. ప్రభుత్వ సంక్షేమ పథ కాలైన కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ వం టివి ప్రతి గడపకూ చేరేలా ఆయన చేసిన నిరంతర పోరాటం నేడు ఓట్ల రూపంలో మారుతోంది. ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్మమని శ్రీకాంత్ అం టున్నారు.




