5 August, 2026 | 10:00 PM

ఎంజేపీ గురుకుల పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

05-08-2026 09:22 PM

గణపురం,(విజయక్రాంతి): గణపురం మండలం గాంధీనగర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఆషాఢ మాసం బోనాల పండుగను బుధవారం సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు స్వప్న రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ డాక్టర్ ఇంజపెల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగను భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణంలో ఉత్సాహంగా సాగాయి.