5 August, 2026 | 10:05 PM

గూడూరుపాడులో బీఆర్ఎస్ పార్టీకి మరో బలమైన చేరిక

05-08-2026 09:34 PM

ఖమ్మం రూరల్,(విజయక్రాంతి): గూడూరుపాడు గ్రామానికి చెందిన సీపీఐ యువ నాయకుడు మారుతి నరేష్ కుటుంబం, హర్షి డెవలపర్స్ అధినేత ఆల్లిక వెంకటేశ్వరరావు, ఏదులాపురం PACS డైరెక్టర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ... గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజాసేవ, పార్టీపై పెరుగుతున్న ప్రజాదరణతో పాటు రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. గ్రామ ఎన్నికల్లో సర్పంచ్ పదవి తృటిలో చేజారినప్పటికీ వెనుకడుగు వేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఆల్లిక వెంకటేశ్వరరావు నాయకత్వంలో గూడూరుపాడులో బీఆర్ఎస్ మరింత బలపడుతోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కుటుంబాలు పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. BRS పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని మారుతి నరేష్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.