5 August, 2026 | 9:56 PM

ప్రభుత్వ విద్యాలయాలే... ప్రగతికి గీటురాళ్లు

05-08-2026 09:24 PM

శారదాంబ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంగాధరరావు

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాలయాలే ప్రగతికి గీటు రాళ్లు అని శారదాంబ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంగాధర్ రావు పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి విద్యార్థులకు బుధవారం స్కూలు బ్యాగులు స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాలు ప్రతిభావంతులకు వేదికలని విద్యార్థులు విద్యతోపాటు విద్యేతర కార్యక్రమాల్లో ముందు ఉండడం అభినందనీయమన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రతిభలో అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతున్నారంటే కారణం ఉపాధ్యాయుల కృషి విద్యార్థుల పట్టుదలయే అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మరెన్నో కీర్తి కిరీటాలను అధిరోహించి  పాఠశాలకు తద్వారా జవహర్ నగర్ కే కాకుండా దేశానికి పేరు తేవాలని సూచించారు. అనంతరం ఆరో తరగతి చదువుతున్న 54 మంది విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బ్యాగులు నోటుబుక్స్ స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి సంఘం కోశాధికారి సిహెచ్ భానుమూర్తి, ఏ. రామ్మోహన్రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రాజేందర్, పెంచలయ్య, ఉషారాణి ,మేరీ లావణ్య కోమలి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.